Bigg Boss6: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వడంతోనే మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఇలా 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించగానే వారి మధ్య గొడవలు కొట్లాటలు కూడా మొదలైపోయాయి.
ఇకపోతే మొదటివారం నామినేషన్ ప్రక్రియ ఎంతో రంజుగా సాగిందని చెప్పాలి. ఈవారం నామినేషన్ లో భాగంగా మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. బాలాజీత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానా, సత్య శ్రీ, ఫైమా, రేవంత్, చలాకి చంటి, ఆరోహి నామినేషన్ లో ఉండగా బిగ్ బాస్ ట్రాష్ విభాగంలో ఉన్నటువంటి బాలాజీత్య, అభినయశ్రీ, ఇనయా సుల్తానా ముగ్గురిలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని క్లాస్ టీంలో ఉన్న సభ్యులకు ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో బాలాదిత్యను సేవ్ చేయడంతో మిగిలిన 7 నామినేషన్స్ లో ఉన్నారు.ఇలా నామినేషన్స్ ఇచ్చిన బిగ్ బాస్ సెలబ్రిటీ కపుల్ గా వెళ్లినటువంటి రోహిత్ మెరీనా దంపతులకు కూడా బిగ్ షాక్ ఇచ్చారు. కంటెస్టెంట్లు వీరిద్దరిని ఇద్దరిగా చూడకుండా ఒకటిగా చూడాలని, వీరిద్దరిలో ఎవరిని నామినేట్ చేసిన ఇద్దరినీ నామినేషన్ పరిగణలోకి తీసుకోబడుతుందంటూ షాక్ ఇచ్చారు.
ఇలా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం వీరిద్దరిలో ఒక్కరు నామినేషన్ లో ఉండి ఎలిమినేట్ అయిన ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి బిగ్ బాస్ వీరిద్దరికి బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక మొదటివారం నామినేషన్ లో ఉన్నటువంటి ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…