Featured

Nikhil Sidharth : బీజేపీ వాళ్ళు ఇప్పుడు నిఖిల్ ని కూడా కలుస్తారా… సినిమా హీరోలతో వరుస భేటీలతో జోరు మీదున్న బీజేపీ..!

Nikhil Sidharth : ‘కార్తికేయ 2’ సినిమా ఊహించని విజయం నమోదు చేయడంతో ఇప్పుడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో నిఖిల్ సిధార్థ పేరు బాగా వినిపిస్తోంది. నార్త్ లో అయితే కార్తికేయ సినిమా హవా ఇంకా బాగా ఉంది. సినిమా ఎంత సక్సెస్ అయిందో సినిమాలో నటించిన నిఖిల్ కి కూడా అంతే పేరు వచ్చింది. ఇక కార్తికేయ సినిమా మొత్తం హిందూత్వ గొప్పతనం గురించి సాగుతుంది. శ్రీ కృష్ణుడిని దేవుడిగా కంటే ఒక సైంటిస్టు గా అభివర్ణిస్తు వచ్చే డైలాగులు నార్త్ వాళ్ళను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం సంస్కృతిని గొప్పగా చూపించడమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా వల్ల క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్ ను బీజేపీ అగ్ర నేతలు కలవాలని అనుకుంటున్నారట.

మొన్న ఎన్టీఆర్, నిన్న నితిన్, నేడు నిఖిల్…

తెలంగాణ బీజేపీ జోరు మీదుంది. మునుగోడు ఉపఎన్నికల మీద బాగా ఫోకస్ చేసింది. కెసిఆర్ కు మేమే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను జనాల్లోకి పంపిస్తోంది. ఇక మొన్నటికి మొన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చి ఎన్టీఆర్ ను కలిసి వెళ్లారు. కేవలం అయన నటనను అభినంధిచిండానికే అంటూ చెప్పినా రాజకీయంగా ఈ భేటికి ప్రాముఖ్యత ఉంది. ఇక దీని తరువాత బీజేపీ ముఖ్య నేత జేపీ నడ్డా ఈ సారి మరో హీరో నితిన్ ను కలిసి మాట్లాడారు. పాలిటిక్స్ వైపు అసలు ఏ మాత్రం టచ్ లేని నితిన్ ను పిలిచి మాట్లాడటంతో ఈ భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక ఇప్పుడు కార్తికేయ హీరో నిఖిల్ ను కూడా బీజేపీ నేతలు కలవబోతున్నట్లు కథనాలు వినపడుతున్నాయి.

నిజానికి నితిన్ ను కలిసినపుడు నిఖిల్ ను కలవాలని అనుకున్నారట. అయితే నిఖిల్ కి బదులు నితిన్ ను కలిశారంటూ ప్రచారం జరుగుతోంది. నిఖిల్ నితిన్ పేర్లు ఒకేలా ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేతలు పోరబడినట్లు అందరూ అనుకుంటున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల మరోసారి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఇక ఆ సమయంలో నిఖిల్ ను కలిసే సూచనలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. కార్తికేయ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ అమిత్ షా కు సన్నిహితుడు అవ్వడం కూడా ఈ భేటీ ఉండొచ్చు అన్న ఊహగానాలకు ఊతం ఇచ్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago