Featured

Super Star Krishna : కొడుకు తరువాత కృష్ణ గారికి నచ్చిన హీరో ఎవరంటే…!

Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదానాన్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ రెట్టింపు ఫాలోయింగ్ తో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు.

మహేష్ తరువాత ఆ హీరో అంటే ఇష్టం…

ఇక ఇప్పటికీ మహేష్ సినిమాల విషయంలో కృష్ణ గారు జడ్జిమెంట్ ఇస్తుంటారు. వృద్ధాప్య కారణాలతో ఇంటికే పరిమితమైన కృష్ణ గారు అప్పుడప్పుడు యూట్యూబ్ లో పలు ఛానెల్స్ నిర్వహించే ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక సినిమాల్లో ఇప్పటి హీరోలలో కృష్ణ గారికి కొడుకు మహేష్ తరువాత ఏ హీరో అంటే ఇష్టమని అడుగగా ఎన్టీఆర్ పేరు చెప్పారు.

ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టమంటూ మనసులోని మాట బయటపెట్టారు. ఇక అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో ఉన్న అనుబంధం గురించి కూడా అనుభవాలను జ్ఞాపకాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మాటలకు నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ మహేష్ మధ్య చక్కని అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబును ఎన్టీఆర్ అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago