comedian Srilakshmi : రమాప్రభ కి నోరు తెరిస్తే తిట్లే… నువ్వొక ఆర్టిస్ట్ వా అనేది…: సీనియర్ నటి శ్రీలక్ష్మి

Comedian Srilakshmi : బాబు చిట్టీ అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీ లక్ష్మి. ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగు ప్రొడ్యూసర్ అమర్నాథ్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లక్ష్మి తండ్రికి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టింది. శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ కూడా హీరోగా, సినిమాల్లో నటించారు. ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా తమిళ, తెలుగులో నటిస్తోంది.

రమాప్రభ గారు అందరినీ తిడతారు…

శ్రీలక్ష్మి గారు సినిమా ఇండస్ట్రీకి ఆర్థిక ఇబ్బందులకు వల్లనే రావడం జరిగింది. దాంతో వచ్చిన ఏ అవకాశం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో సినిమాల్లో కమెడియన్ గా నటించడం మొదలు పెట్టారు. ఒకానొక సమయానికి తెలుగులో రమాప్రభ గారి తరువాత మంచి లేడీ కమెడియన్ గా శ్రీలక్ష్మి గారు స్థిరపడ్డారు. ఇదే విషయాన్ని రమాప్రభ గారే స్వయంగా శ్రీలక్ష్మి గారికి తెలిపారట.

ఎపుడూ తిట్టే రమాప్రభ గారు ఒకరోజు ఫోన్ చేసి ఒక సీరియల్ లో శ్రీలక్ష్మి నటనను మెచ్చుకుంటూ బాగా చేసావ్ అని చెప్పారట. ఎపుడూ తిడుతూ నువ్వసలు ఆర్టిస్ట్ వా అంటూ అందరినీ తిట్టే రమాప్రభ గారు నన్ను అలా మేచ్చుకోవడంతో చాలా బాగా అనిపించింది. ఇక సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు కూడా బాగా నటిస్తున్నావ్, ఏవి పడితే ఆ పాత్రలు చేయకు పరిధి, ప్రాముఖ్యం ఉన్న పాత్రలే చెయ్యి అని చెప్పారంటూ శ్రీలక్ష్మి తెలిపారు.