Hero Bellamkonda Ganesh : సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ గంగ సినిమా తరువాత సినిమాలను నిర్మించలేదు. కేవలం కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్ధ కొడుకు సాయి శ్రీనివాస్ తో కలిసి ‘అల్లుడు శీను’ సినిమాను నిర్మించారు సురేష్. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ ఇద్దరు కొడుకులు సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమయ్యారు. శీను తాజాగా బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ సినిమాలో నటించగా తమ్ముడు గణేష్ స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. తాజాగా మరో సినిమా ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమతో అలరించునున్న గణేష్ ఇటీవల ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గురించి మాట్లాడారు.
బాలకృష్ణ కాల్పుల వివాదం నాకు తెలియదు…
బెల్లంకొండ సురేష్ గారు బాలకృష్ణ గారి మధ్య 2004 లో జరిగిన కాల్పుల వివాదం అప్పట్లో హాట్ టాపిక్. బెల్లంకొండ సురేష్ అలాగే మరోవ్యక్తి సత్యనారాయణ చౌదరి మీద బాలకృష్ణ కాల్పులు జరిపిన సంఘటనలో అప్పట్లో కేసు నడిచింది. ఈ వివాదం తరువాత బెల్లం కొండ సురేష్ గారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా జరిగారు అనే అభిప్రాయాలూ వెలువడ్డాయి.
ఈ విషయం గురించి సురేష్ గారి చిన్న కొడుకు గణేష్ మాట్లాడుతూ నా వయసు అపుడు పదేళ్ళు కూడా లేవు అందుకే నాకు ఆ విషయం గురించి పెద్దగా తెలియదు. ఇక పెద్దయ్యాక మా నాన్న కానీ కుటుంబంలో ఎవరూ కానీ ఆ విషయం గురించి చర్చించలేదు. నాకు అడగలవసిన అవసరం రాలేదు అంటూ చెప్పారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…