Minister Roja : మంత్రి రోజాకు అభినందన సభ… హాజరుకానున్న సినీ ప్రముఖులు..!

Congratulatory meeting for Minister Roja : ప్రేమ తపస్సు సినిమా తో రోజా సినీ ప్రయాణం మొదలు పెట్టిన సర్పయాగం సినిమా ద్వారా వెండితెర మీద మొదటిసారి కనిపించింది. ఇక సీతారత్నం గారి అబ్బాయి రోజా సినీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత వెనుతిరిగి చూసుకునే పని లేకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల ను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది. తర్వాత ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు సెల్వమణి వివాహం చేసుకుంది. ఇక రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజ. పాలిటిక్స్ ను, సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది.

Congratulatory meeting for Minister Roja

రెండుసార్లు ఎమ్మెల్యే పదవి లో ఉన్నప్పటికీ రోజా పలు టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా కనిపించారు.ఇక ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు కూడా స్వీకరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మంత్రి పదవి చేపట్టాక టీవీ ప్రోగ్రాంమ్స్ కు గుడ్ బాయ్ చెప్పేశారు. ఇప్పుడు తన మంత్రి పదవి మీదనే తన పూర్తి దృష్టిని, సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. రోజా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేయబోతున్నారు. మే 7న చెన్నైలో సినీ ప్రముఖుల చేత సత్కారం  జరగనుంది.

రోజా అభినందన సభకు హాజరుకానున్న సినీ ప్రముఖులు….

అయితే రోజాకు ఈ అభినందన సభను దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ దర్శకనిర్మాతల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నారు.అన్నాశాలైలోని ఫిలిం ఛాంబర్‌ లో  బుధవారం దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ దర్శకుడు అయిన భారతీరాజా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారతీరాజా ఒక హీరోయిన్ నుంచి మంత్రి గా ఎదిగిన రోజా తీరును అభినందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రోజా భర్త అయిన సెల్వమణి రోజాకు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.