ఆ వాసన వల్ల కూడా కరోనా… హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..?

ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురించి పరిశోధనలు చేస్తుండగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు మనం వదిలే అవపాన వాయువులు(పిత్తులు) నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించామని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

శరీరం నుంచి బయటకు వచ్చే గ్యాస్ కూడా ప్రమాదకరమే అని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే కరోనా బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో దగ్గు నుంచి గ్యాస్ బయటకు వస్తుందని అలా వచ్చే గ్యాస్ కూడా ప్రమాదకరమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రేలియా డాక్టర్ డాంగీ టాగ్ మాట్లాడుతూ వైరస్ గురించి ఈ విషయాలను వెల్లడించారు.

కరోనా వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వాళ్లే ఎక్కువగా వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. మొదట్లో, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు మాత్రమే కరోనా లక్షణాలు కాగా రోజురోజుకు కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.

యూరప్ శాస్త్రవేత్తలు కాళ్ల వేళ్లను బట్టి కూడా కరోనా సోకిందో లేదో గుర్తించవచ్చని.. కాలి వేళ్లు కందిపోయినట్టు కనిపించినా లేక తాకగానే నొప్పిగా అనిపించినా కరోనానే కావచ్చని.. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.