దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై పంజా విసురుతున్న కరోనా.. జాగ్రత్తంటున్న నిపుణులు..?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ జీవనశైలి వ్యాధిగ్రస్తులు అయినటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండ వంటి తదితర సమస్యలతో బాధపడే వారిలో అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత వారిలో అధికంగా ఉంటుంది.తద్వారా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, మధుమేహంతో బాధపడేవారిలో మూడింతలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధులతో బాధపడేవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరించారు.

ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో ఎలాంటి యాంటీబాడీలు వృద్ధి చెందడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువును తాకిన శానిటైజర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తగినన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.