మందుబాబులకు చేదువార్త.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?

మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ, ఎనిమిది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారం సాధారణంగా అమ్ముడయ్యే మద్యంతో పోలిస్తే ఎక్కువగా మద్యం అమ్ముడవుతుంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లను పోలీసులు బ్రీత్ అనలైజర్ల సహాయంతో సులభంగా గుర్తించేవాళ్లు. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత పోలీసులు బ్రీత్ అనలైజర్లను వినియోగించడం లేదు.

దీంతో పోలీసులు మందుబాబులను పరీక్షించడం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. గీత గీసి ఆ గీతపై నడవాలని సూచించటం, వేళ్లు లెక్క పెట్టమని చెప్పడం, కళ్లు ఎర్రగా మారైతే మద్యం సేవించారని భావించడం, నిటారుగా నిలబడమని చెప్పడం ద్వారా మందుబాబులు మద్యం సేవించారో లేదో పోలీసులు గుర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఇతర మార్గాల ద్వారా కూడా మందుబాబులను గుర్తించే పనిలో పడ్డారు.

ఎవరైనా మద్యం సేవించి తాగలేదని చెబితే అలాంటి వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి భారీ జరిమానా విధిస్తున్నారు. మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మందుబాబులు వీలైతే మద్యానికి దూరంగా ఉండటం, మద్యం తాగినా సొంతంగా వాహనాలను నడపకపోవడం చేస్తే మంచిది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మద్యం తాగే వాళ్ల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి.