స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 452 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 11వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://www.sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ద్వారా మేనేజర్ (మార్కెటింగ్), మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్), ప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్), అసిస్టెంట్ మేనేజర్ (సిస్టం), డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)-28, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), ఇతర ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఎస్బీఐ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఉద్యోగాలకు అర్హత, అనుభవాన్ని బట్టి వేతనం లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ ఈ సంవత్సరం ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…