కోవాగ్జిన్ కు అమెరికాలో ఎదురు దెబ్బ..! సరఫరాకు నో పర్మిషన్..!

మనదేశంలో అభివృద్ధి చేసిన తోలి కరోనా వాక్సిన్ కోవాగ్జిన్. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ దీనిని అభివృద్ధి చేసింది. అయితే కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రాగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి నిరాకరించింది. టీకా వినియోగానికి భారత్ బయోటెక్, యూఎస్ లోని అక్యూజెన్ అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే తాజగా ఆక్యుజెన్‌తో ప్రతిపాదనలను బిడెన్ సర్కార్ నిరాకరించింది. అత్యవసర వినియోగానికి FDA నో చెప్పడంతో.. పూర్తిస్థాయి పర్మిషన్ కోసం మరోసారి అప్లై చేసుకున్నట్టు ఆక్యుజెన్‌ వెల్లడించింది. అందుకు కోసం మరింత డేటా కోరినట్లు పేర్కొంది ఆక్యుజెన్‌. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్‌ లో కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల కావొస్తుంది. ఇప్పటికి కూడా భారత్ బయోటెక్ తమ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.