రక్తహీనతతో బాధపడేవారు.. కరివేపాకు నూనె ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.. ఎలా అంటే..!

కరివేపాకు అనేది ఎవరికైనా పరిచయం లేని పేరు. దాదాపు ప్రతీ ఒక్కరికీ తెలుసు. కూరల్లో మంచి ఘుమఘుమలకు దీనిని ఉపయోగిస్తారు. కానీ తినేటప్పుడు మాత్రం దానిని తీసి పక్కకు పెడతాం. అయితే దీని ద్వారా నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎన్నో రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే.. కరివేపాకు ఆయిల్ వల్ల జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.

అంతేకాకుండా రక్త హీనతతో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. రక్తహీనత అనేది ఐరన్ లోపం వల్ల వస్తుంది. హిమోగ్లోబిన్ ఉన్న పరిమాణంలో కాకుండా తక్కువగా ఉంటే ఈ వ్యాధి వస్తుంది. అయితే దీనిని పూర్తిగా నివారించాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. వాటితో పాటు కరివేపాకు నూనెను కూడా వాడొచ్చు.

అదెలా అంటే.. ఒరేగానో ఆయిల్, బాసిల్ ఆయిల్ వంటి ఇతర హెర్బ్ ఆయిల్‌ల వలె కరివేపాకు ఆయిల్ కూడా ప్రసిద్ధి చెందింది. ఇది మీ వంటకాలకు తాజా వాసన, రుచిని అందిస్తుంది. అదనంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనాలు, మలబద్ధకం, వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. దీంతో రక్త హీనత అనేది మటుమాయం అయిపోతుంది. తాజా కరివేపాకు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని కరివేపాకు ఆకులతో మరేదైనా కంపెనీ నూనెను కలిపి కరివేపాకు నూనెను తయారు చేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు.