ఉదయాన్నే కరివేపాకును తినడంతో.. ఆ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!

మనం వండే వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఏ కూర తాలింపు వేసినా కరివేపాకు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి ప్రత్యేకత ఉంది కరివేపాకుకు. కరివేపాకు మొక్కను ఎక్కడ వేసినా నాటుకుంటుంది. ఆకుపచ్చని రంగులో ఉండే కరివేపాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే కూరలో కరివేపాకు కనపడితే చాలామంది తీసి బయట వేస్తుంటారు. కానీ వాటివళ్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని కరివేపాకులను తింటే ఎంతో ఆరోగ్యం. ఇవి మన చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడగలవు. ఉదయం లేచి ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకు ఆకుల్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదట్లో చేదుగా అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. కరివేపాకులో సాధారణంగా కార్బోహైడ్రేట్స్, పాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇంకా దీనిలో విటమిన్ ఏ, బి, సి, ఈ లు కూడా అధికంగా ఉంటాయి. కరివేపాకుని రోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తుంది. కరివేపాకు ఎక్కడ వుంటే అక్కడ దోమలు మరియు క్రిమి కీటకాలు ఉండవు. కరివేపాకులో అతి ఎక్కువ ఐరన్ శాతం వుంది.

రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా రోజూ 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినటం అలవాటు చేసుకోవటం వలన మధుమేహవ్యాధిని కొద్దివరకు నియంత్రించుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టురాలడం కూడా ఆగతుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కంటిచూపు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.