CVL Narasimharao : క్రిమినల్ లాయర్ గా ఎన్ని కోట్లు సంపాదించానంటే… నన్ను అందుకే కాస్ట్లీ లాయర్ అంటారు…: నటుడు & లాయర్ సీవీఎల్ నరసింహారావు

CVL Narasimharao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తెలుగు నటుడు నరసింహారావు గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివిధ విషయాల గురించి రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన వృత్తి పరంగా లాయర్ అయినా సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక లాయర్ గా ఎన్నో కేసులు వాదిస్తూ బాగానే సంపాదించానని, అయితే సినిమాలలో మంచి పాత్రలు వస్తుంటాయి అది నా అదృష్టం అంటూ చెప్తారు నరసింహారావు. వెంకీ, జాతిరత్నాలు, ఠాగూర్, యువసేన వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రెండు కెరీర్ల గురించి తెలిపారు.

లాయర్ ఆదాయం బాగుటుంది…

క్రిమినల్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న నరసింహారావు గారికి అడ్వకేట్ గా మంచి పేరుంది. అలా ఆయన ఒకవైపు న్యాయవాదిగా ఉంటూనే మరోవైపు సినిమాల వైపు అడుగులేశారు. పది శాతం నటుడుకి నటన తెలిసినా మిగతాది అదృష్టం ఉంటేనే మంచి పాత్రలు సినిమాల్లో లభిస్తాయి, నా విషయంలో నేను పెద్ద డైరెక్టర్ల వద్ద మంచి పాత్రలను చేశాను అంటూ చెప్పారు. ఇక అడ్వకేట్ గా బాగా పేరు ఉండటం వల్ల బాగానే సంపాదిస్తున్నా అంటూ చెప్పారు.

కోట్ల ఆస్తులు ఉన్నాయని గంటకు లక్షల్లో ఫీజు తీసుకుంటానని అయితే ఐదు లక్షలకి మించి అయితే ఉండదంటూ చెప్పారు. అందుకే తనని ఖరీదైన లాయర్ అని అంటుంటారని చెప్పారు. లాయర్ కి ఉన్న వెసులుబాటు అదే ఫీజు గా డబ్బు తీసుకున్నా అది తప్పు కాదు. కార్పొరేట్, బిసినెస్ కి సంబంధించిన కేసులు వాదించేవాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో చార్జ్ చేస్తారు. క్రిమినల్ లాయర్ కి అంత ఫీజు ఉండదు అంటూ చెప్పారు.