బాలకృష్ణ – ఎన్టీఆర్ చేయాల్సిన ‘యమగోల’.. ఎన్టీఆర్ – సత్యనారాయణ చేయడానికి కారణం ఏమిటో తెలుసా?

తాతినేని రామారావు దర్శకత్వంలో 1997వ సంవత్సరంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, జయప్రద జంటగా నటించినటువంటి చిత్రం “యమగోల”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇందులో యముడి పాత్రలో సత్యనారాయణ చేయగా హీరో పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా చేశారు. నిజానికి ఈ సినిమా ముందుగా అనుకున్నది బాలకృష్ణ -ఎన్టీఆర్ చేయాలని భావించారనే ఈ విషయం మీకు తెలుసా?అయితే బాలకృష్ణ స్థానంలో సత్యనారాయణ రావడానికి కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ముందుగా “యమగోల” టైటిల్ తో ఈ సినిమాను డైరెక్టర్ సి.పుల్లయ్య తీయాలని భావించారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ హీరోగా పుల్లయ్య దర్శకత్వంలో “దేవాంతకుడు” అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా యమ ధర్మరాజు పాత్ర తరహాలోనే తెరకెక్కించారు. ఇందులో ఎస్.వి.రంగారావు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే సి.పుల్లయ్య కుమారుడు యమగోల సినిమాను మరింత డెవలప్ చేసి నిర్మాత డి.ఎన్‌. రాజుకు చెప్పారు ఈ కథ అతనికి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది. అయితే ఈ సినిమా హక్కులను రామానాయుడు కొన్నారు.కొన్న తర్వాత కథ మొత్తం విన్న రామానాయుడికి ఈ సినిమా సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టారు. సుమారు 17 ఏళ్ల తర్వాత రామానాయుడు దగ్గరనుంచి సినిమాటోగ్రాఫర్ -ప్రొడ్యూసర్ అయినటువంటి ఎస్ వెంకటరత్నం యమగోల అనే టైటిల్ కొన్నారు.

డి.వి. నరసరాజు చేత కథను డెవలప్ చేయించి, మాటలు రాయించారు. గతంలో పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవాంతకుడు’ సినిమాలో చేశారు కనుక, ‘యమగోల’ సినిమాని ఆయన తనయుడు బాలకృష్ణతో చేస్తే బాగుంటుందనీ, ఆలాగే యముడి పాత్రలో ఎన్టీఆర్-హీరో పాత్రలో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని భావించారు.అయితే అప్పటికి బాలకృష్ణ కేవలం సొంత సినిమాల్లో తప్ప బయట చిత్రాలలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడం వల్ల హీరో పాత్రలో ఎన్టీఆర్ -యమధర్మరాజు పాత్రలో సత్యనారాయణతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ విధంగా తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన యమగోల సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.