Director Bucchibabu : ఉప్పెన కథ వైష్ణవ్ తేజ్ కి చెప్పగానే… పెద్ద మామకి చెప్పమన్నాడు…: డైరెక్టర్ బుచ్చిబాబు

Director Bucchibabu : లెక్కల మాస్టర్ సుకుమార్ గారి శిష్యుడు ఆయన డైరెక్టర్ అయ్యారని స్టూడెంట్ బుచ్చిబాబు కూడా డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఇంట్లో వాళ్ళు మొదట్లో ఒప్పుకోక పోతే ఎంబిఏ చదువుకుంటానని హైదరాబాద్ వచ్చి అక్కడ సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు బుచ్చిబాబు. ఆయన 100 % లవ్ సినిమా తీసే సమయానికి అసిస్టెంట్ గా ఉన్న బుచ్చిబాబు సుకుమార్ గారి రంగస్థలం సినిమా టైం కి ఉప్పెన కథ రాసుకున్నారట. అప్పటి నుండి కథలో మార్పులు చేస్తూ కథను సిద్ధం చేసుకోన్నాడు .

పెద్ధ మామ కి చెప్పమన్నాడు …

స్నేహితుడిని ద్వారా ఇంస్టాగ్రామ్ లో వైష్ణవ్ తేజ్ ఫోటో చూసి నచ్చి తనని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. విషయం సుకుమార్ గారికి చెబితే ఆయన వైష్ణవ్ ను కలిసి కథ చెప్పమని చెప్పారట. ఇక అలా వైష్ణవ్ తేజ్ కి కథ చెప్పాక తాను మళ్ళీ కాల్ చేసి పెద్దమామ కి కథ ఒకసారి కథ చెప్పండి అని చెప్పడంతో బయమేసింది. చిరంజీవి గారికి కథ చెప్పాలంటే కొంచం బెరుకుగా అనిపించింది అంటు బుచ్చిబాబు చెప్పారు.

కథ విషయంలో ఎలాంటి భయం లేదు. సినిమాలో హీరోకి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తారు అనే విషయం చెప్పాలన్న నాకు ఎలాంటి భయం కలుగలేదు. ఎందుకంటే కథలోని ట్విస్ట్ ను వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు అనే ఉదేశ్యం తోనే నేను ఉన్నాను అంటూ బుచ్చిబాబు తెలిపారు. ఇక చిరంజీవి గారు కథ విని బాగుందన్నారు అంటూ బుచ్చిబాబు సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రేమను కులం,మతం మాత్రమే కాదు సెక్స్ కూడ వేరు చేయలేదనేది చెప్పాలనుకున్నాను ఆ పాయింటే నేషనల్ అవార్డ్స్ జ్యురి వాళ్లకు నచ్చిందనుకుంటా అందుకే అవార్డులు ఇచ్చారు అంటూ బుచ్చిబాబు తెలిపారు.