Director Geetha Krishna : ఉదయ్ కిరణ్ చనిపోయింది అందుకే… డైరెక్టర్ తేజ కి తెలిసింది ఇదేనా : డైరెక్టర్ గీతా కృష్ణ

Director Geetha Krishna : ‘చిత్రం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో అగ్ర హీరో రేంజ్ కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితంలో అనుకోకుండా చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ అవ్వడం, ఆ తరువాత అది క్యాన్సిల్ అవడం ఇవన్నీ ఒకెత్తయితే ఇక మెల్లగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయి కెరీర్ డౌన్ ఫాల్ మొదలై సినిమాలు లేక ఖాళీగా ఉండలేక డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఇదంతా జరిగి చాలా ఏళ్ళు గడిచినా ఇప్పుడు డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ గురించి బయో పిక్ తీస్తాను, అతను ఇలా ఎందుకు మరణించాడో అసలైన నిజాలను చెబుతాను అంటూ ప్రకటించడంతో మరోసారి ఉదయ్ కిరణ్ గురించి చర్చ మొదలైంది. ఇక ఈ విషయాల గురించి డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

తేజ ఏమి చెప్పాలనుకుంటున్నారు… అప్పుడు జరిగింది ఇదే…

ఉదయ్ కిరణ్ తో నేను ఒకసారి మాట్లాడాను, పెద్దగా పరిచయం లేదు, తన తండ్రితో మాట్లాడాను అంటూ చెప్పారు. అది కూడా చిత్రం సినిమా సమయంలో చాలా బాగా సినిమా చేసారని చెబుతూ కాల్ చేసి మాట్లాడానని గీతా కృష్ణ తెలిపారు. ఇక అప్పట్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ వారి ద్వారా వీరి ద్వారా విన్నవే అయినా ఉదయ్ విషయంలో జరిగినవి ఇవి అంటూ గీతా కృష్ణ గారు మాట్లాడారు. చిరంజీవి కూతురు సుస్మిత నే ఉదయ్ ని లవ్ చేయడంతో వాళ్లిద్దరూ కలిసి తిరిగేవారు, ఇంట్లోవాళ్ళు అభ్యంతరం చెప్పకపోవడంతో ఎంగేజ్మెంట్ చేసారు. అయితే అదే సమయంలో ఒక వార్తా పత్రికతో పవన్ కళ్యాణ్ కి ఉన్న గొడవ కారణంగా వాళ్ళు ఉదయ్ కిరణ్ కు అప్పుడే ఒకసారి పెళ్లయింది అంటూ ఫోటోలు ప్రచురించారు అంటూ, చిరు ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఉదయ్ ను కొట్టడం అవి జరిగి పెళ్లి రద్దయిందని అప్పట్లో ప్రచారం జరిగిందంటూ చెప్పారు.

ఇక ఉదయ్ కెరీర్ ఆ తరువాత బాగోలేదు దానికి కారణం మెగా ఫ్యామిలీ అంటూ వినిపించినా వారికి అలా చేయాల్సిన అవసరం ఏముంది అంటూ చెప్పారు. అయితే పవన్ కి చిరు కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం వల్ల వారు ఉదయ్ ని వ్యతిరేకించడం వల్ల అతని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ చెప్పారు. అయితే డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరూ బాగా క్లోజ్, ఉదయ్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజనే కనుక ఇంకేమైనా అందరికీ తెలియని విషయాలు తెలిసి ఉండవుచ్చు ఇక ఇప్పుడు అతనికి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ఇప్పుడు బయోపిక్ తో మళ్ళీ హిట్ కొట్టొచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.