Featured

Laywer Gandla Rathna Rao : కృష్ణ ఆస్థిలో నరేష్ కి వాటా వస్తుందా?? కోర్ట్ కి వెళితే జరిగేది అదే : లాయర్ గాండ్ల రత్నరావు

Laywer Gandla Rathna Rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15 న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన మరణం తరువాత ఆయన వీలునామా లో ఏమి రాశారు, కృష్ణ వెన్నంటే ఎపుడు ఉండే నరేష్ కి ఆస్థిలో వాటా ఉంటుందా, కోర్ట్ కి వెళితే ఏమి జరుగుతుంది అనే విషయాల గురించి క్లారిటీగా లాయర్ రత్నరావు గారు వివరించారు.

అస్థి కోసం కోర్టుకు వెళితే జరిగేది అదే…

రత్న రావు గారు మాట్లాడుతూ కృష్ణ గారు వీలునామా గనుక రాసి అందులో ఎవరికి ఆస్తి చెందాలని ఉంటే వారికే ఆస్తి దక్కుతుంది. అలా కాకుండా ఇప్పుడు పంచుకోవాల్సి వస్తే ఇండియన్ చట్టం ప్రకారం ఆయన సొంతబిడ్డలు ఆడపిల్లలు మగపిల్లలకు సమానంగా ఆస్తి పంపకం జరుగుతుంది. ఇక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండో వివాహం మొదటి భార్య అనుమతితో జరిగినా లేక దాపరికంగా జరిగినా మొదటి భార్య బ్రతికే ఉంటే ఆ పెళ్లి చెల్లదు. ఆమెకు ఆస్థిలో వాటా ఉండదు. అయితే ఒకవేళ రెండో భార్యకు అతని వల్ల సంతానం కలిగితే వారికి ఆస్థిలో వాటా హక్కు ఉంటుంది.

అయితే ఇక్కడ విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ కృష్ణ గారికి పుట్టిన వ్యక్తి కాదు కాబట్టి ఆస్థిలో వాటా ఉండదు. ఒకవేళ ఆయనకు ఆస్థిలో వాటా ఇవ్వలేదని కోర్ట్ కి వెళ్లినా అక్కడ కూడా చెల్లదు, చట్టం ఆలా లేదు. కొన్ని ఇతర దేశాలలో ఉంది కానీ ఇండియాలో అలాంటి చట్టం లేదు. వాళ్ళు సెంటిమెంట్ గా ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, ఒకవేళ వీలునామా లో కృష్ణ గారు రాసుంటే నరేష్ కు ఆస్తి వస్తుంది అంటూ రత్నరావు గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago