Director Krishnavamsi : శ్రీకాంత్ కి బదులుగా నాగార్జున కావాలని అడిగారు… ముగ్గురికి వాడు ఒక్కడే విలన్…: దర్శకుడు కృష్ణ వంశీ

Director Krishna vamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో రంగమార్థండ అనే సినిమాతో మరోసారి వచ్చారు. ఇక తన కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఖడ్గం సినిమాలో ఆ క్యారెక్టర్ కి మొదట అనుకుంది ఆ హీరోనే…

ఖడ్గం సినిమా రవితేజ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్లందరి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పొచ్చు. ఆ సినిమాలో అగ్రెస్సివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ నటన మరచిపోలేము. అయితే మొదట ఆ సినిమాలో నిర్మాతలతో కాస్టింగ్ గురించి చర్చించినపుడు మొదట శ్రీకాంత్ చేసిన పాత్రకు నాగార్జునని అనుకున్నారట. నాగార్జున అయితే బిజినెస్ కూడా జరుగుతుంది అని నిర్మాతలు అభిప్రాయపడితే కృష్ణ వంశీ మాత్రం ఆ పాత్రకి శ్రీకాంత్ ని అనుకున్నారట. నాగార్జున చేస్తే ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. కానీ సినిమాలో ముగ్గురు పాత్రలు సమానం.

జెండా లో మూడు రంగుల లాగ ఉండాలి అందుకే ఆయన వద్దని అనుకున్నారట. ఇక జగపతి బాబుని అనుకున్న శ్రీకాంత్ కే ఫిక్స్ అయ్యారట కృష్ణ వంశీ. ఇక సినిమాలో విలన్ అంటే ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో తీవ్ర వాదిగా అజర్ పాత్రలో నటించిన షఫీ నే. సినిమాలో ఒక పాకిస్థాన్ తీవ్ర వాదీని విడిపించడానికి అజర్ ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ వస్తాడు. ఇక సినిమాలో ముగ్గురు హీరోలకు ఆయన విలన్ గా మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ కృష్ణ వంశీ తెలిపారు.