Director Nandam Harischandra : దాసరి గారి అవమానాలు… మొహాం అద్దంలో చూసుకున్నావా అన్నారు… మందు తాగకపోతే ఎలా డైరెక్టర్ అవుతావు..?: దర్శకుడు నందం హరిశ్చంద్ర

Director Nandam Harischandra : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీ లోకి చాలా యాద్రచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఏంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో స్వర్గం నరకం సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు తాత మనవడు సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా సంసార సాగరం సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు. అలా ఆయన జీవితం గురించి పుస్తకం రాసారు హరిశ్చంద్ర రావు గారు. అలా దాసరి గారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఆయన అవమానాలను భరించి గొప్ప డైరెక్టర్ అయ్యారు….

దాసరి గారు తెలుగులో మొదటగా డైరెక్టర్ల రాజ్యాన్ని తెచ్చారు. డైరెక్టర్ కు అంతవరకు విలువ ఇవ్వని ఇండస్ట్రీ లో ఆయన డైరెక్టర్ బట్టి సినిమా హిట్ అవుతుందని నిరూపించిన వారిలో ఒకరిగా నిలిచారు అంటూ అయన తొలినాళ్ళలో ఎదుర్కోన్న ఇబ్బందులను వివరించారు. నాటకాలను డైరెక్ట్ చేస్తూ నటిస్తూ ఉన్న దాసరిగారికి ఒకానొక సినిమా ప్రొడ్యూసర్ పిలిచి అవకాశం ఇస్తానని చెప్పడం వాళ్ళే చెన్నై పిలుచుకుని వెళ్లి ఒక వేషం ఇచ్చారట. అయితే మేకప్ వేయడానికి వచ్చిన అతను మేకప్ వేస్తూ ఎలా వస్తారో నటించడానికి అద్దంలో మొహం చూసుకున్నావా అంటూ అవమానించారట. రాయల్ గా వెళ్ళాను అయినా ఇక్కడ ఈ ఛీత్కారాలు ఏమిటి అని బాధపడిన ఆయన అయినా సినిమాలో నటించలై ఒప్పుకున్నాను అని దిగమింగి వెళ్లారట. అక్కడ చెప్పిన వేషం కాకుండా వేరే వేషం ఇచ్చారట. అదేమని అడిగితే నిర్మాత నీకు నా తరువాతి సినిమాలో మంచి వేషం ఇస్తాను డిస్ట్రిబ్యూటర్లు మార్చేశారు. వారిని కాదని నేను చెప్పే శక్తి లేదని చెప్పారట. అయితే అక్కడ తన స్థానములో ఆ పాత్రలో నటించిన కమెడియన్ సరిగా డైలాగ్ చెప్పకపోవడంతో దాసరిగారు చెప్పగా అందరూ చప్పట్లు కొట్టారట.

ఇక నిర్మాత ఆఫీస్ లోనే టైఫిస్ట్ గా పనిచేస్తున్న ఉన్న దాసరిగారు రచయిత కూడా కావడంతో సదరు నిర్మాత ఒక రచయిత కు పరిచయం చేయగా ఆయనకు పుస్తకాలను చూపించారట దాసరిగారు. అయితే ఆ రైటర్ మందు తాగుతూ నా వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తావా అని అడిగితే చేస్తానని చెప్పారట. అయితే ఆ రైటర్ మందు తాగమంటే నాకు అలవాటు లేదని దాసరి నేను ఒట్టు పెట్టుకున్నాను తాగను అని చెప్పారట. అయితే ఆ రైటర్ కోపంతో మాకు మాత్రం పుట్టుకతో అలవాటు వచ్చిందా మందు తాగకుండా నువ్వు డైరెక్టర్ ఎలా అవుతావు కాలేవు అంటూ అరిచారట. సదరు విషయాలను నందం హరిశ్చంద్ర రావు గారు నేటి తరానికి ఇటువంటివి తెలియాలి అంటూ చెప్పారు.