Featured

Artist Bengaluru Padma : ఏమే వచ్చావా అని కోటా అన్నాడు…రామానాయుడు బ్యానర్లో ఎక్కువ సినిమాలను చేయడానికి కారణం…: నటి బెంగళూరు పద్మ

Artist Bengaluru Padma : బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి బెంగళూరు పద్మ. సీరియల్స్ ద్వారా ఎక్కువగా కనిపించే పద్మ గారు సురేష్ ప్రొడక్షన్స్ అలాగే ఈటీవీ వారి ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా కనిపించి మెప్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఎక్కువ సినిమాలను చేసిన ఆమె, ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్ తల్లిగా నటించారు. ఇక ఆమె భర్త అరుణ్ అలాగే కూతురు గాయత్రీ కూడా పలు సినిమాల్లో నటించగా గాయత్రి హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా అందరికి సుపరిచితురాలే. ఇక పద్మ గారు తన నేపధ్యం అలాగే కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రామానాయుడు వద్ద ఎక్కువ సినిమాలను చేయడానికి కారణం….

పద్మ గారు చిన్నతనం నుండి నాటక రంగంతో అనుబంధం ఉండటం వల్ల కోటా, తనికెళ్ళ భరణి, బాబు మోహన్ వంటి వారు వాళ్ళ ఇంటికి వచ్చి నాటకాల రెహర్సల్స్ చేసుకునేవారట. అలా మంచి అనుబంధం ఉండటం వల్ల సినిమాల్లో నటించే సమయంలో కోటా గారు ఏమే పద్మ వచ్చావా అంటూ మాట్లాడించేవారట. ఇక రామానాయుడు గారి ప్రొడక్షన్ లో ఎక్కువగా సినిమాలను చేయడానికి కారణం గురించి చెబుతూ ఆయన లాంటి లెజెండ్స్ తో వర్క్ చేయడం కంటే గోప్ప ఏముంటుంది.

ఆయన జీవిత చరిత్ర చదివాక ఆయన మీద గౌరవం మరింత పెరిగింది. అలాంటి గొప్పవారిముందు నేను ఒక ఇసుక రేణువు అనిపిస్తుంది. పైగా ఆయన నిర్మాతగా ఒక సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. చిన్న ఆర్టిస్ట్ అయిన పేరుతో పిలిచి పలకరిస్తారు. షూటింగ్ లో ట్రాలీ తోయాలన్న ఆయన చేస్తారు. నేనేందుకు చేయాలనీ భావించరు అంటూ చెప్పారు అందుకే ఆయన సినిమాల్లో పనిచేస్తే కుటుంబంతో కలిసి ఉన్నట్లే అనిపిస్తుంది అంటూ చెప్పారు పద్మ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago