Director Relangi Narasimharao : నా టైం మొత్తం వృధా చేసాడు.. నేనే రంగంలోకి దిగి పూర్తి చేసాను…: దర్శకుడు రేలంగి నరసింహారావు

Director Relangi NarasimhaRao : పాలకొల్లుకి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఆ అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.

నా టైం మొత్తం వృధా చేసాడు….


జంధ్యాల గారి అహన పెళ్ళంటా సినిమా చూసాక ఒక పిసినారి పాత్ర నుండి కథ అల్లుకుని హాస్యం పుట్టించి హిట్ కొట్టిన విధానం చూసి పిసినారి కాన్సెప్ట్ తో సీనిమా తీయాలనీ డిసైడ్ అయ్యారట రేలంగి. కథ మొదట అనుకున్నాక రైటర్ దగ్గరికి వెళ్లి డెవలప్ చెయాలనుకున్న రేలంగి గారికి ముందు సినిమా ప్రొడ్యూసర్ అయినా భాస్కర్ రెడ్డి గారే మళ్ళీ సీనిమా నిర్మిస్తానని చెప్పడంతో ఒక మంచి పేరున్న రైటర్ వద్దకు వెళితే హోటల్ లో రూమ్ బుక్ చేయించుకుని మూడు నెలలు కథ గురించి చర్చలు వదిలేసి వేరే ఇతర విషయాలు మాట్లాడి టైం వృధా చేసేశారట.

ప్రస్తుతం ఆయన లేరు మరణించారు అందుకే పేరు చెప్పడం లేదంటూ రైటర్ పేరు చెప్పడానికి రేలంగి గారు ఇష్టపడలేదు. ఇక చివరికి ప్రొడ్యూసర్ గారినే హేళనగా మాట్లాడటంతో నచ్చక ఆయనను వదిలించుకుని నేనే కథ పూర్తిగా సిద్ధం చేసి మరో ఇద్దరు రైటర్లు నాకు తెలిసిన వాళ్లకు కథ వినిపించి స్క్రిప్ట్ వారంలో పూర్తి చేసి షూటింగ్ కి వెళ్ళాను అంటూ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు.