Featured

Vaishnavi Chaitanya: బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇన్ని కష్టాలు పడిందా… డబ్బు కోసం అలా చేసేవారా?

Vaishnavi Chaitanya: బేబీ సినిమా ద్వారా నటిగా ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారారు నటి వైష్ణవి చైతన్య.సినిమాలలోకి రాకముందు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే హీరోయిన్ గా ఈమె నటించిన మొదటి సినిమా బేబీ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్య చిన్నప్పటి నుంచి తాను పడినటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను పదో తరగతి చదువుతున్న సమయంలోనే కుటుంబ బాధ్యతలను తీసుకున్నానని తెలిపారు. నాకు తెలిసినది డాన్స్ ఒక్కటే కుటుంబ పోషణ కోసం తాను పలు ఈవెంట్స్ లో డాన్స్ చేస్తూ డబ్బులు సంపాదించానని తెలిపారు.

ఇలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ముందుకు నడిపించామని వైష్ణవి చైతన్య తెలిపారు.ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కొందరు స్టార్స్ వాష్ రూమ్ కోసం తమ క్యారవాన్ ఉపయోగించుకుంటామన్న కూడా వీలు లేదని ఎంతో అవమానకరంగా మాట్లాడారు.ఒకరోజు వాష్ రూమ్ లో బట్టలు చేంజ్ చేసుకోవడం చూసిన మా అమ్మ ఎంతో బాధపడి మనకు ఇవన్నీ వద్దు అంటూ ఎంతో బాధపడింది అయితే నాకు ఆ క్షణం మరింత పట్టుదల పెరిగింది అని తెలిపారు.

Vaishnavi Chaitanya: వాష్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాము..

ఈ విధంగా చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుతాను ఈ స్థాయికి వచ్చానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక బేబీ సినిమా సమయంలో కూడా తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని నిర్మాత తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అలాగే ఈమె కలలు నెరవేరాయని చెప్పాలి. ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఏ ఒక్కటి అధికారికంగా ప్రకటించలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago