Director Relangi Narasimharao : బాలాదిత్య కు బట్టలు లేకుండా చేస్తేనే అని చెప్పా… కౌశిక్ ను కాదని తన తమ్ముడిని తీసుకోడానికి కారణం అదే…: డైరెక్టర్ రేలంగి నరసింహారావు

Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఇక ఆ సినిమా అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.

బాలాదిత్య ను తీసుకోడానికి కారణం అదే….

‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక పిసినారి. ఆయన పిసినారితనం భరించలేక ఆయన భార్య దివ్యవాణి విడిపోతుంది. వారి కొడుకుగా పిసినారి తండ్రికి తగ్గ తనయుడిగా బాలాదిత్య ఆ సినిమాలో బాగా నటించాడు. అయితే మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలాదిత్య అన్న కౌశిక్ ను సెలెక్ట్ చేశారట. కొన్ని సీన్స్ తనకి చేయమని చెప్పి కౌశిక్ చేసాక ఓకే చేశారట రేలంగి.

అయితే బాలాదిత్య వచ్చి నేను చేస్తాను ఒకసారి చుడండి అని చెబితే సరే అయితే బట్టలు లేకుండా కేవలం లో దుస్తులతో చేయాలి చేస్తావా అని అడిగితే చేస్తాను అంకుల్ అని ఏ మాత్రం కెమెరా అంటే బెరుకు లేకుండా చేసాడట. ఇక సినిమాలో ఐస్ గడ్డ మీద కూర్చొని పందెం గెలిచే సీన్ ఉండటం వల్ల ఆ క్యారెక్టర్ కి బాలాదిత్య అయితే సరిపోతాడని అనిపించిందట రేలంగి గారికి. అధికాక కౌశిక్ కొంచం పెద్ద పిల్లవాడు. బాలాదిత్య చిన్నవాడు కాబట్టి ఇంకా బాగుంటుందని భావించి వాళ్ళ పేరెంట్స్ కే డెసిషన్ వదిలేసారట. ఇక బాలాదిత్య, కౌశిక్ వల్ల నాన్న శంకర్ గారు కౌశిక్ కి వేరే సినిమాలు ఉన్నాయి బాలాదిత్య ఇప్పటివరకు ఇంకా సినిమాల్లో చెయలేదు తానే చేస్తాడు లెండి అని చెప్పారట. అలా సినిమాలో బాలాదిత్య రాజేంద్ర ప్రసాద్ జోడి మంచి హాస్యం పండించారు.