Director Teja : జీవితంలో చాలా తప్పు చేశాను…డబ్బులు కట్టలేక మా ఇంటిని…నా నోటి దురుసు వల్ల కోటి రూపాయల పెనాల్టీ కట్టాను…: డైరెక్టర్ తేజ

Director Teja : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి రాత్, గులాం తదితర హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అవార్డ్స్ కూడా అందుకున్నారు. తరువాత సినిమా డైరెక్టర్ అయిన తేజ చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన సినిమాల్లో హీరోల దగ్గరి నుండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరిని ఆడిషన్ చేసి ఆయనే స్వయంగా ఎంపిక చేస్తారు. చాలా రోజుల గ్యాప్ తరువాత డైరెక్టర్ తేజ మళ్ళీ అహింస అనే సినిమాతో మళ్ళీ వస్తున్నాడు. కొత్తవాళ్ళను ఎక్కువగా ప్రోత్సహించే తేజ మరోసారి కొత్త హీరోతో వస్తున్నాడు.ఇక తన కెరీర్ లో ఎన్నో సార్లు తప్పు చేసానంటూ చెప్తున్న డైరెక్టర్ తేజ ఇటీవల ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

ఆ సినిమాల ప్లాప్స్ నన్ను బాగా దెబ్బతీశాయి….

జీవితంలో కొన్ని సినిమాల విషయంలో బాగా సరిదిద్దుకోలేని తప్పులు చేసానంటూ తేజ తెలిపారు. అందుకే ఆర్థిక ఇబ్బందుల వల్ల సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను లోన్స్ కట్టలేక ఇంటి ముందు బ్యాంకు వాళ్ళు బోర్డు కూడా వేశారు. అయితే అప్పంతా తీర్చేసి ఇల్లు సొంతం చేసుకున్న కూడా ఆ బోర్డు తీయలేదు. నేనుచేసిన తప్పులు నాకు గుర్తు రావాలని అలాగే ఉంచాను. కాని నా భార్య ఆ బోర్డు కి పెయింట్ వేయించింది. నీకు గుర్తుంటే చాలు అందరికి గుర్తుండాల్సిన అవసరం లేదంటూ తీసేసింది అని చెప్పారు.

ఇక సినిమాల విషయంలో షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ సమయంలోనే వర్క్ సరిగా లేకపోతే ఇక ఏదో వాళ్ళు చెప్పినట్లు చేసేస్తుంటాను నాకు ఇంట్రెస్ట్ పోతుంది అంటూ చెప్పిన తేజ గారు ఒక సినిమా విషయంలో ముందే ఆ సినిమా ప్లాప్ అవుతుందని తెలుసు ఆ విషయం చెప్పానని సినిమా ప్లాప్ అయ్యాక ఆ నిర్మాత నా మీద కేసు వేయగా దాసరి గారు దగ్గరుండి నాతో కోటి పెనాల్టీ కట్టించారు అంటూ చెప్పారు తేజ.