Disco Shanthi: నయనతార వస్త్రధారణపై నటి డిస్కో శాంతి బోల్డ్ కామెంట్స్.. చూడటానికే అసహ్యం అంటూ?

Disco Shanthi: ప్రస్తుతం ఉన్న ఈ సినిమా ప్రపంచంలో ముందుకు సాగాలంటే నటనతో పాటు గ్లామర్ కూడా ముఖ్యమైనదని భావిస్తారు. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున నటిమనులు విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు కొంతమంది నటిమనుల వస్త్రధారణ పై ఎన్నో విమర్శలు వెల్లు వెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై సీనియర్ నటి డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కొంతమంది నటీమణులు ఎలాంటి వస్తు ధారణ వేసుకున్నప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే మరికొందరు ఒళ్ళు కనపడకుండా నిండుగా చీర కట్టుకున్నా అంద విహీనంగానే కనిపిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోని ఈమె నయనతార గురించి మాట్లాడుతూ ఆమె వస్త్రధారణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నయనతార శ్రీరామరాజ్యం సినిమాలో నిండుగా చీర కట్టుకొని ఎంతో అందంగా కనిపించారు. అలాగే బిల్లా సినిమాలో బికినీ ధరించి స్కిన్ షో చేసిన అందంగా ఉన్నారు. ఇలా నయనతార ఎలాంటి దుస్తులు ధరించిన చాలా అందంగా ఉంటారని ఆమె డ్రెస్ సెలక్షన్ చాలా బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా డిస్కో శాంతి నయనతార వస్త్రధారణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Disco Shanthi: ఎలాంటి దుస్తులు వేసుకున్నాం అనేది ముఖ్యం కాదు…

ఈ విధంగా ఈమె వస్త్రధారణ గురించి మాట్లాడుతూ మనం ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు ఆ దుస్తులు మనకు ఎలా ఉన్నాయనేది ముఖ్యమని తెలిపారు మరికొందరు స్కిన్ టైట్ డ్రెస్సులు ధరించి చూడటానికే ఎంతో అసహ్యంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారని,మరికొందరు ఎక్స్పోజ్ చేసినా కూడా పెద్దగా బాగుండారంటూ ఈ సందర్భంగా ఈమె హీరోయిన్ల వస్త్రధారణ పై తన అభిప్రాయాలను తెలియజేశారు.