Featured

Vijaya Saireddy : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉంటే అది మనకు గర్వకారణం… గిరిపుత్రుల కథ ప్రపంచం మెచ్చింది… ఎంపీ విజయ్ సాయి రెడ్డి

Vijaya Saireddy : ఆర్ఆర్ఆర్, ఆస్కార్ ఈ రెండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాను ఊపేస్తున్న పదాలు. దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ కు ఇంటర్నేషనల్ లెవల్ లో ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలవబోతోంది అంటూ వస్తున్న ఊహగాణాల నడుమ అందరూ ఈ విషయం గురించి చర్చ మొదలు పెట్టారు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు లేదా డైరెక్టర్ కు సాంగ్ కో లేకపోతే ఉత్తమ చిత్రంగానో సినిమాకు అవార్డు రావచ్చు అంటూ లెక్కలేస్తున్నారు. ఇక ఈ ఆస్కార్ గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించాడు.

గిరిపుత్రుల బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి అవార్డు మనకు గర్వకారణం…

నిజానికి త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు దాటినా ఇంకా సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. మొన్నామధ్య ఎన్టీఆర్ ఆసియా నుండి ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉంది అంటూ హాలీవుడ్ మ్యాగ్ జైన్ వెరైటీ ప్రకటించడం, ఇక ఇప్పుడు అందులోకి రామ్ చరణ్ పేరు కూడా రావడం తో ఎవరు ఆస్కార్ బరిలో ఉండబోతున్నారు అన్నది ఆసక్తిని పెంచుతోంది. ఎవరు ఆస్కార్ లో నిలిచినా మన తెలుగు సినిమా గౌరవం రెట్టింపు అయినట్లే అని అందరూ భావిస్తున్న తరుణంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సినిమా గురించి మాట్లాడారు.

ఎంపీ విజయసాయి ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉండబోతోంది అనే వార్తలపై స్పందిస్తూ దేశభక్తి కి సంబంధించి ఇద్దరు గిరిపుత్రులు బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని చూపించిన సినిమాకు అవార్డు వస్తే అది మనకు గర్వకారణం అంటూ చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆస్కార్ నామినేషన్స్ లో ఉండొచ్చు అంటూ హాలీవుడ్ మ్యాగజైన్ వైరైటీ ప్రకటించడంతో ఈ వాఖ్యలు చేశారు. హాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది సినిమా టెక్నీషియన్స్, డైరెక్టర్లు సినిమాను ప్రశంసించడం మన తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago