పరగడుపున మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే!

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయం. కానీ మొలకెత్తిన విత్తనాలు ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన విత్తనాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కానీ కొందరికి మాత్రమే పరగడుపున ఆ విత్తనాలను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారు. వేరుశెనగలు, పల్లీలు, పెసలు, సద్దులు వంటి వాటిని ఒకరోజు మొత్తం నానబెట్టుకుని రాత్రిపూట ఒక బట్టలో ఒకటి పెడితే ఉదయానికి మొలకలు వస్తాయి.

మొలకలు వచ్చిన విత్తనాలు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు, బీపీ వంటి సమస్యలు కంట్రోల్ చేయవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, వృద్ధులు వాటిని పరగడుపునే తినటం వల్ల వారికి అజీర్తి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు పచ్చివి తినటం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి నేరుగా వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువలన మొలకెత్తిన విత్తనాలను నీళ్లలో ఉడక పెట్టుకొని తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. మొలకెత్తిన గింజలను పచ్చిగా తినటం కంటే ఉడకబెట్టుకొని తినటం ఆరోగ్యానికి మంచిది.