బిగ్ బాస్ కార్యక్రమం నేటితో 13 వారాలను పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ లో ఉన్నటువంటి ఏడు మంది కంటెస్టెంట్ లో సన్నీ షణ్ముఖ్ జస్వంత్ తప్ప మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ నామినేషన్స్ లో ఉన్నారు . ఈ క్రమంలోనే ఈ వారం సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక సింగ్ డేంజర్ జోన్ లో ఉండి ఈ వారం తను బయటకు వెళ్లనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.గత మూడు రోజుల నుంచి ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ప్రియాంక అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న బిగ్ బాస్ హౌస్ ను కాజల్ వీడనుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
గత వారం కూడా నామినేషన్ లో ఉన్నటువంటి ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించిన చివరికి బిగ్ బాస్ అందరికీ ఊహించని విధంగా రవిని ఎలిమినేట్ చేస్తూ ప్రియాంకను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు. తాజాగా 13వ వారం కూడా ఇదే జరగబోతోందని తెలుస్తోంది.
ఈ వారంలో కూడా ప్రియాంక వెళుతుందని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నప్పటికీ బిగ్ బాస్ అందరికీ ఊహించని విధంగా షాక్ ఇస్తూ ఈ వారం కాజల్ ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించనునట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలంటే మరి కొన్ని గంటల వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…