నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు.ఒక పాత్రలో మురళీకృష్ణ పాత్రలో నటించగా, శివుడి పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఇందులో బాలయ్య అఘోరాగ తన విశ్వరూపం చూపించారు.ఇలా ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.
ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్ర సినిమాకి మరింత హైలెట్ అయ్యింది. బాలకృష్ణ కన్నా ముందుగానే పలువురు హీరోలు ఘోర పాత్రలలో నటించారు. మరి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కన్నా ముందుగా ఘోర పాత్రలో నటించారు. మరి ఈ హీరోలు ఏ సినిమాలో అఘోరగ కనిపించారు అనే విషయానికి వస్తే…
మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అర్జున్, సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో చిరంజీవి శివుడి పాత్రలో నటించారు.ఈ సినిమాలో ఒక సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి ఆఘోరాగా కనిపించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చినటువంటి నాగవల్లి చిత్రంలో వెంకటేష్ అఘోరా పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా చంద్రముఖి సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నాగార్జున డమరుకం సినిమాలో ప్రకాష్ రాజు శివుడి పాత్రలో కనిపించగా నాగార్జున ఒక సన్నివేశంలో ఆఘోర పాత్రలో కనిపించారు. ఇలా బాలకృష్ణ కన్నా ముందుగా ఈ హీరోలు అఘోరాలుగా నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయక పోయినప్పటికీ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మాత్రం అఖండమైన విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…