తెరమీద కొన్ని కాంబినేషన్స్‌ను చూస్తుంటే మనసుకు ఓ రకమైన హాయి కలుగుతుంది. ఇప్పటి చిత్రాలలో ఇలాంటి హాయి అనిపించేవి చాలా తక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న కొద్ది మందికి కూడా సరైన అవకాశాలు రాక కనుమరుగవుతున్నారు. ఈ మధ్యకాలంలో కోవైసరళ కనిపించడం బాగా తగ్గిపోయింది. ఆవిడ నటించిన సినిమాలను చూస్తే కాస్త మనసు ఉల్లాసంగా మారిపోతుంది. సినిమా ఫ్లాపయినా కోవైసరళ కనిపిచినంత సేపూ మాత్రం ఆ ఆనందమే వేరు.
అలాంటి సీనియర్ నటీమణి రమాప్రభ. ఆవిడకి అవకాశాలు రావాలే గానీ ఇప్పటికీ చిన్న పాత్రైనా చేసేందుకు ఎంతో ఆరాటపడుతుంటారు. మనదనపల్లి నుంచి సినిమా షూటింగ్ ఉందంటే ఇప్పటికీ ఆగమేఘాల మీద వచ్చేస్తారు. అంతగా ఆమె సినిమాను ప్రేమిస్తారు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన కొన్ని సినిమాలలో కనిపించిన రమాప్రభ ఉన్న కాసేపు హాయిగా నవ్వించి వెళతారు. సినిమాలో వేశం ఇచ్చినా ఇవ్వకపోయినా పూరి ఇప్పటికీ రమాప్రభకు ప్రతినెల ఆర్ధిక సహాయం చేస్తున్నారు. చెప్పాలంటే ఇది ఆర్థిక సహాయం కాదు అలాంటి సీనియర్ నటులకు ఇప్పుడున్న వారు ఇవ్వాల్సిన గౌరవం. అదే పూరి చేస్తున్నారు.
ఇక రమాప్రభ అప్పట్లో ఎక్కువగా నటించిన ప్రముఖ హాస్య నటుడు రాజబాబు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్ని దాదాపు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక సినిమాలో రాజబాబు – రమాప్రభ కాంబినేషన్ సీన్స్ వస్తే థియేటర్స్‌లో ప్రతీ ఒక్కరు ఎంతగా ఎంజాయ్ చేసేవారో. సీన్స్‌లో ఇద్దరు పోట్లాడుకుంటున్నట్టు అనిపించిన అది చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పించేది. సూపర్ స్టార్ కృష్ణ – భారతి జంటగా నటించిన అఖండుడు సినిమాలోని ఫస్ట్ నైట్ సీన్‌లో రాజబాబు – రమాప్రభల మధ్య జరిగే సంభాషణ ఎంత బావుంటుందో చూసిన వారికే తెలుస్తుంది.
అదే ఇప్పటి సినిమాలలో ఫస్ట్ నైట్ సీన్ అంటే ఓ పెదవి ముద్దు..హీరోయిన్ ఎక్స్‌ఫోజింగ్..ఓ డ్రీమ్ సాంగ్ ఉంటుంది. రొమాంటిక్ సీన్స్‌లో ఇప్పుడు చూపిస్తున్న వల్గారిటీ అప్పట్లో ఉండేది కాదు. అందుకే అప్పటి సినిమాలు మంచి క్లాసిక్స్ అయ్యాయి. తాతా మనవడు లాంటి సినిమా ఎప్పుడు చూసుకున్న ఆనందంగా ఉంటుంది. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా తాతా మనవడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో గొప్ప సినిమా అని చాలా సందర్భాలలో చెప్పారు.
ఈ సినిమాలో రాజబాబు – రమాప్రభ మధ్య ఉన్న అన్నీ ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తున్న అభిమానులు చాలామందే ఉన్నారు. జీవన జ్యోతి, మంచివాడు లాంటి సినిమాలలో వీరి కాంబినేషన్ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రత్యేకంగా వీరి కోసమే కొన్ని సినిమాలలో సపరేట్‌గా ట్రాక్ రాసేవారు. అంతేకాదు సినిమాలో ఈ ఇద్దరు ఉన్నారంటే బిజినెస్ బాగా జరిగేదట. అంటే సినిమాకు మార్కెట్ పరంగా రాజబాబు – రమాప్రభ ఎంతగా ప్లస్ అయ్యారో అర్థం అవుతోంది. ఇవే కాదు వీరి కాంబినేషన్‌లో వచ్చిన అన్నీ సినిమాలకి అదే క్రేజ్ ఉండేది. అమర ప్రేమ, ఇల్లు ఇల్లాలు, అర్ధాంగి లాంటి ఎన్నో సినిమాలలో రాజబాబు – రమాప్రభ జంట అద్భుతంగా ఆకట్టుకుంది. ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ చూడబోమని నిస్సందేహంగా చెప్పవచ్చు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…