విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి తారకరామారావు లక్ష్మి జంటగా ఒకే కుటుంబం చిత్రం ద్వారా మొట్టమొదటిసారి నటించారు. అనంతరం ఈ సినిమా తరువాత బంగారు మనిషి చిత్రంలో మరోసారి ఈ జంట తెరపై సందడి చేశారు. బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు నటి లక్ష్మికి మధ్య జరిగిన ఓ సంఘటనను తాజాగా లక్ష్మి గుర్తుచేసుకున్నారు.
మామూలుగా ఎన్టీఆర్ సినిమా సెట్లో ఉన్నారంటే అతనికి భోజనం అల్పాహారం అని ఇంటి నుంచే వస్తాయి.ఇలా బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం అతని ఇంటి నుంచి అల్పాహారం వచ్చిందని అయితే అందరితో పాటు తింటున్న సమయంలో నేను కేవలం సగం దోసే తిని వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు లక్ష్మీగారు ఒకసారి రండి అని మర్యాదగా పిలిచారు. ఏంటండీ అని నేను ఎన్టీఆర్ దగ్గరకు వెళితే సగం దోశ తినడానికి మీకు సిగ్గుగా లేదా? అని అడిగారు.
అలా ఎన్టీఆర్ గారు ఆ మాట అనగానే ఎంతో షాక్ అయ్యానని లక్ష్మీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ మాటలకు ఏంటండీ ఎంతో మర్యాదగా పిలిచి ఇలా మాట్లాడుతున్నారు అని సరదాగా అడిగాను. లేకపోతే మరి ఏంటండీ ఇంత చిన్న వయసులో మీరు ఎలా తినాలి. మరి సగం దోశ తినడం ఏంటండీ.. చిన్న వయసు వారు బాగా తిని ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యం బాగా చూసుకోవాలి.
ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కదా ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండేది అంటూ ఆ రోజు ఎన్టీఆర్ తనకు చెప్పారని ఇప్పటికీ ఆ సన్నివేశం నాకు బాగా గుర్తు ఉందని ఈ సందర్భంగా లక్ష్మి బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…