Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?

Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?

Health Benefits: మన శరీరం కోట్లాది అణువులతో ఏర్పడింది. శరీరంలో జీవక్రియలు జరగాలంటే… మనిషికి నీరు చాలా ముఖ్యం. ఆహారం లేకపోయినా కొన్ని వారాల పాటు బతికే అవకాశం ఉంటుంది. కానీ నీరు లేకపోతే కేవలం కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతారు.

Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?
Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?

అంతలా శరీరానికి నీరు అవసరం. మానవశరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. నీరు లేకపోతే శరీరంలోని జీవక్రియలు సరిగా పనిచేయలేవు. ఏ కాలం అయినా నీటిని తప్పకుండా సరిపడేంతగా నీటిని తీసుకోవాలి. ఇలా చేయని పక్షంలో చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?

మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే..అన్ని అవయవాలు వాటి పనితీరును సక్రమంగా నిర్వహించాలంటే నీరు చాలా అవసరం. ఎండాకాలం, చలికాలం ఏ కాలం అయినా శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. శరీరంలో తగినంతగా నీరు లేకపోతే మూత్రపిండాలు, జీర్ణక్రియ, మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.

కళ్ల కింద నల్లటి వలయాలు..

శరీరానికి తగినంత నీరు అందకపోతే.. మూత్రం పసుపు రంగులో మారతుంది. దీని ద్వారా మన శరీరానికి నీరు అవసరమని గుర్తించవచ్చు. ఒక వ్యక్తి తక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే.. జీర్ణశక్తి బలహీన పడటంతో పాటు కడుపులో నొప్పి, మంట ప్రారంభం అవుతుంది. తగినంత నీరు లేకపోతే మనం తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. నీరు తగినంత తీసుకోకపోతే.. శరీరం పొడిబారుతుంది. ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. శరీరంలో నీటి కొరత ఉంటే కీళ్ల నొప్పులు, తలనొప్పి వస్తాయి. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల పెదాలు కూడా పొడి బారుతాయి. ఎవరికైనా పెదవులు పగిలడం ప్రారంభిస్తే.. శరీరంలో తగినంత నీరు శరీరంలో లేదని అర్థం చేసుకోవచ్చు. వర్క్ అవుట్స్ చేసే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఓ వ్యక్తి రోజుకు 12-14 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో పాటు శరీరంలో నీటి శాతం కూడా ఎక్కువ కాకుండా కూడా జాగ్రత్త పడాలి. ఎక్కువ నీరు కూడా శరీరానికి హాని కలిగిస్తుంది.