Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిన విషయమే. మోహన్ బాబు గారు సెట్ లోకి వస్తున్నారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో అలర్ట్ అయ్యవారు. అయితే మోహన్ బాబు గురించి ఇండస్ట్రీలో ఓ వార్త వినిపించేది. ఆయనకు నచ్చని పని చేస్తే చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు అంటూ చాలా మంది చెబుతుంటారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు గారితో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఎం.వి.రఘు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు గారితో సుమారు ఆరు సినిమాల వరకు చేశానని మా ఇద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటి చిత్రం డిటెక్టివ్ నారద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని ఆయన తెలిపారు.
అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో కలెక్టర్ గారు, రాయుడు, చిట్టెమ్మ మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఖైదీ గారి వంటి చిత్రాలకు తానే సినిమాటోగ్రాఫర్ గా పని చేశానని తెలిపారు. ఇలా మోహన్ బాబు గారితో ఎంతో చనువు ఉన్న ఎం.వి.రఘు అతని సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
ఇలా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అయితే ఈ విషయంపై స్పందించిన ఎం.వి.రఘు మా ఇద్దరి మధ్య ఎలాంటి క్లాష్ లేదని అది కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. మోహన్ బాబు గారు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఆయన సెట్ లోకి వస్తున్నారు అంటే నేను తినడం కూడా మానేసి వెళ్లేవాడిని, సెట్ లో ఎవరు తప్పు చేసినా ఆ ప్రభావం తనపై ఉండేదని ఈ విధంగా ఆయన వస్తున్నారంటే భయంతో వణికిపోతూ ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని తెలిపారు.ఇలా ఆరోగ్యం పాడవుతున్న నేపథ్యంలో ఇంట్లో వాళ్ళు కూడా అంత టెన్షన్ పడుతూ సినిమాలు చేయడం దేనికి మానేయొచ్చు కదా అని చెప్పడం వల్లే మోహన్ బాబు గారితో సినిమాలు చేయడం మానేశాను అని అంతకు మించి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఎం.వి.రఘు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…