తినడానికి తిండి లేని సమయంలో ఎస్.వి.రంగారావు దీనస్థితిని చూసిన అంజలి దేవి ఏం చేశారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్ వి రంగారావు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్.వి.రంగారావు ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో బాధలు, అవమానాలు, ఆకలి కేకలు ఉన్నాయి. వాటన్నింటినీ భరిస్తూ, వాటిని దాటుకొని నటుడిగా సినిమారంగంలో ఓ గొప్ప స్థాయికి చేరుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నటుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అలాంటి ఇబ్బందులే ఎస్ వి రంగారావు కూడా ఎదుర్కొన్నారు. ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశంతో మద్రాసుకు వచ్చిన ఎస్.వి.రంగారావు అక్కడ తేనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్ చివరన ఉన్న ఓ ప్రెస్‌లో పడుకోవడానికి నేలపై పేపర్లను పరచుకొని సినిమా కలలను కనేవాడు. ఎస్.వి.రంగారావు తో పాటు తాతా మనవడు సినిమా నిర్మాత కె.రాఘవ ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చారు.

ఈ విధంగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎంతో కృంగిపోయిన ఎస్.వి.రంగారావు తినడానికి తిండి లేక కేవలం నీళ్లు తాగుతూ ఆకలిని చంపుతున్నారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావని భావించిన ఎస్.వి.రంగారావు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు రాఘవ తనని వారించి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎస్.వి.రంగారావుకి నాటకాల ద్వారా వీళ్ళతో పరిచయం ఏర్పడిన అంజలీదేవి వీరి ఆకలి బాధలను చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే అంజలీదేవి వారి ఇంటిలో అయ్యర్ లకు చెప్పి వారు ఎప్పుడు వచ్చిన భోజనం లేదనకుండా పెట్టాలని సూచించారు. అలా అంజలిదేవి వారి ఆకలి బాధలను తీర్చారు. ఇక ఎస్వీరంగారావు హీరోగా నటించినటువంటి మొదటి చిత్రం “వరూధిని” ఫ్లాప్ అవ్వడంతో ఆయన పరిస్థితి మరీ మొదటికి వచ్చింది.

ఇలా అవకాశాల కోసం వెతుకుతునప్పటికీ అయిదారు చిత్రాలలో నటించిన ఎలాంటి గుర్తింపు లేదు. ఇక ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకుని ఉద్యోగంలో చేరిన ఎస్.వి.రంగారావు కు దర్శకుడు సుబ్బారావు నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమాలోని నేపాళ మాంత్రికుడు పాత్రలో నటించిన ఎస్ వి రంగారావుకు ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుస అవకాశాలతో అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు.