తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్ వి రంగారావు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్.వి.రంగారావు ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో బాధలు, అవమానాలు, ఆకలి కేకలు ఉన్నాయి. వాటన్నింటినీ భరిస్తూ, వాటిని దాటుకొని నటుడిగా సినిమారంగంలో ఓ గొప్ప స్థాయికి చేరుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నటుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అలాంటి ఇబ్బందులే ఎస్ వి రంగారావు కూడా ఎదుర్కొన్నారు. ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశంతో మద్రాసుకు వచ్చిన ఎస్.వి.రంగారావు అక్కడ తేనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్ చివరన ఉన్న ఓ ప్రెస్‌లో పడుకోవడానికి నేలపై పేపర్లను పరచుకొని సినిమా కలలను కనేవాడు. ఎస్.వి.రంగారావు తో పాటు తాతా మనవడు సినిమా నిర్మాత కె.రాఘవ ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చారు.
ఈ విధంగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎంతో కృంగిపోయిన ఎస్.వి.రంగారావు తినడానికి తిండి లేక కేవలం నీళ్లు తాగుతూ ఆకలిని చంపుతున్నారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావని భావించిన ఎస్.వి.రంగారావు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు రాఘవ తనని వారించి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎస్.వి.రంగారావుకి నాటకాల ద్వారా వీళ్ళతో పరిచయం ఏర్పడిన అంజలీదేవి వీరి ఆకలి బాధలను చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే అంజలీదేవి వారి ఇంటిలో అయ్యర్ లకు చెప్పి వారు ఎప్పుడు వచ్చిన భోజనం లేదనకుండా పెట్టాలని సూచించారు. అలా అంజలిదేవి వారి ఆకలి బాధలను తీర్చారు. ఇక ఎస్వీరంగారావు హీరోగా నటించినటువంటి మొదటి చిత్రం “వరూధిని” ఫ్లాప్ అవ్వడంతో ఆయన పరిస్థితి మరీ మొదటికి వచ్చింది.
ఇలా అవకాశాల కోసం వెతుకుతునప్పటికీ అయిదారు చిత్రాలలో నటించిన ఎలాంటి గుర్తింపు లేదు. ఇక ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకుని ఉద్యోగంలో చేరిన ఎస్.వి.రంగారావు కు దర్శకుడు సుబ్బారావు నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమాలోని నేపాళ మాంత్రికుడు పాత్రలో నటించిన ఎస్ వి రంగారావుకు ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుస అవకాశాలతో అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…