లవ్ స్టోరీ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి మెగస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 న విడుదల విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది.. కోవిడ్ తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో.. అలాంటి అనుభూతి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఈవెంట్లలో మాట్లాడుతుంటే ప్రేక్షకుల నుంచి చప్పట్లు వింటున్నప్పుడు వచ్చే ఈ కిక్కే వేరప్ప.. అంటూ మట్లాడారు. 1980 నుంచి తనకు నిర్మాత నారాయణ్ దాస్ పరిచయం అని.. అతడంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్పాడు.
అతడిని గురువులా భావిస్తాను అన్నాడు. నాగ చైతన్య నిలకడగా వ్యవహరించేనటుడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వేడుకకి వచ్చిన అమీర్ ఖాన్‌కి థ్యాంక్స్ అంటూ చెప్పాడు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ఫిదా సినిమా చేసేంతవరకు తనకు సాయిపల్లవి అంటే ఎవరో తెలియదని.. ఫిదా చిత్రంలో పాటలకు వేసిన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయా అంటూ చెప్పాడు. ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది.
నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదని.. తను ఒప్పుకోకూడదని మనసులో కోరుకున్నా అంటూ చెప్పాడు. ఎందుకంటే అన్నాచెల్లెళ్లుగా నటించాలని నాకు లేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్ చేయాలనుకుంటాను. అనుకున్నట్లుగానే సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని.. నాకు చాలా సంతోషం వేసిందని చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ఆకాక్షించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…