బిగ్ బాస్ సీజన్ 5 లోకి బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రవి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన రవి తనదైన శైలిలో ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల విషయంలో కానీ రవి ఎంతో చురుకుదనం కనబరుస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కొట్లాటలు ఉండగానే బిగ్ బాస్ కంటెస్టెంట్ లో పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇదివరకే షణ్ముఖ్ జస్వంత్ శ్వేత పుట్టిన రోజు వేడుకలకు సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ తాజాగా ఆదివారం (సెప్టెంబర్ 19) యాంకర్ రవి పుట్టినరోజు కావడంతో బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రవి అభిమానులు, కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ బయట నుంచి పెద్ద ఎత్తున టపాకాయలు బెలూన్స్ ఎగర వేస్తూ రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా రవి కూతురు వియా కూడా బెలూన్స్ ఎగరవేసి కేక్ కట్ చేస్తూ తన తండ్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తన తండ్రి గుర్తుకు రావడంతో ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా బిగ్ బాస్ రవి పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తూ తనని కూడా సర్ప్రైస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక రెండవ వారం ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ నుంచి రెండవ కంటెస్టెంట్ గా ఉమాదేవి ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ వారం నామినేషన్స్ జరిగిన తర్వాత ఎవరు నామినేషన్స్ లో ఉంటారో తెలియాల్సి ఉంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…