Tollywood Heros Remuneration: చిరంజీవి నుంచి మొదలుకొని మన టాలీవుడ్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?

Tollywood Heroes Remuneration: ఒకప్పుడు మన టాలీవుడ్ సినిమాలు కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే పరిమితమయ్యాయి.అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో ఉన్నఫలంగా తెలుగు సినిమా మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఒకప్పుడు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మన తెలుగు హీరోలు ప్రస్తుతం 50 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఏ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం…

ప్రభాస్: బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు ఇక ఈయన 25వ చిత్రం స్పిరిట్ సినిమాకి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఒక్కో సినిమాకు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు.

మహేష్ బాబు: ఈయన నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రానికి ఏకంగా 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్: రాజమౌళి సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్ల పారితోషికం తీసుకోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే సినిమాకు ఏకంగా 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

రామ్ చరణ్: రామ్ చరణ్ రాజమౌళి సినిమాకి 45 కోట్లు శంకర్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

చిరంజీవి: రామ్ చరణ్ సొంత బ్యానర్ లోనే ఆచార్య సినిమా తీయటం వల్ల ఈయన రెమ్యునరేషన్ తెలియకపోయినప్పటికీ మార్కెట్ విలువ సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

అల్లు అర్జున్: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రెండు భాగాలకుగాను అల్లు అర్జున్ 60 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.

బాలకృష్ణ: అఖండ సినిమా కోసం బాలయ్య బాబు 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా తన తదుపరి చిత్రానికి 15 కోట్లకు పెంచినట్లు సమాచారం.

నాగార్జున: నాగార్జున ఒక్క సినిమాకు 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వెంకటేష్: వెంకటేష్ కూడా ఒక్కో సినిమాకు 7 కోట్లు పారితోషికం తీసుకోనున్నారు.

విజయ్ దేవరకొండ: చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితో పాటు నాని 8 కోట్లు, మాస్ మహారాజ రవితేజ 13 కోట్లు, వరుణ్ తేజ్ 8 కోట్లు, శర్వానంద్ 4 కోట్లు, నితిన్ 4 కోట్లు, నాగచైతన్య 6 కోట్లు, గోపీచంద్ 3 కోట్లు, రామ్ 8 కోట్లు సాయి ధరమ్ తేజ్ 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.