Byreddy Siddaarth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.ఏ విషయం గురించి మాట్లాడినా ఎంతో కచ్చితంగా మాట్లాడే సిద్ధార్థ రెడ్డికి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కు తన సపోర్ట్ చేసి గెలుపొందినారు.
ఇక వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌కు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇకపోతే ఈ ఎన్నికలలో పార్టీ కోసం ఎంతో కష్టపడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి తన సొంత తమ్ముడి లాంటి వాడని తనకు ఉన్నతమైన పదవి బాధ్యతలు ఇస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. ఇలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించడంతో ఆయనకు మరింత క్రేజ్ దక్కింది. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్ని కార్యక్రమాలలోను ఎంతో చలాకీగా పాల్గొంటారు.
ఇలా ఎప్పుడు రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉండే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో మరో కోణం కూడా ఉందని చూపించారు.ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఒక లైలా ఓ లైలా అనే పాటకు అచ్చం రామ్ చరణ్ తేజ్ ను తలపించేలా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు సిద్ధార్థ రెడ్డిలో ఈ యాంగిల్ కూడా ఉందా… సిద్ధార్థ రెడ్డి మల్టీ టాలెంటెడ్ అంటూ ఆయన డాన్స్ వీడియో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…