రావు గోపాలరావు అంత్యక్రియలకు టాలీవుడ్ స్టార్స్ అందరూ ఎందుకు డుమ్మా కొట్టారో తెలుసా?

గత మూడు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విలనిజాన్ని చూపించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన నటులలో రావుగోపాలరావు ఒకరు. అప్పట్లో తెరకెక్కిన దాదాపు ప్రతి చిత్రంలోనూ ఈయన కనిపించేవారు. విభిన్న పాత్రలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన రావుగోపాలరావు మొదట్లో రంగస్థల నటుడిగా పేరు సంపాదించుకుని ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

రావు గోపాలరావు జనవరి 14, 1937 కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో పుట్టారు. ఆయనకు నటన పై ఉన్న ఆసక్తితో మెల్లిగా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. క్రాంతి కుమార్ నిర్మాణంలో ‘శారద’ సినిమాలో రావు గోపాల్ రావు నటించిన పాత్ర ఆయనకు ఎంతో పేరు సంపాదించిపెట్టింది. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన రావుగోపాలరావు ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత రావు గోపాలరావు తన కెరియర్లో ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఆర్థికంగా బాగా ఎదిగినప్పటికీ ముందుచూపు లేని కారణంగా ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు. అందరిని నమ్మి పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రావుగోపాలరావు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఉన్న డబ్బును కాస్తా చికిత్సకు ఖర్చు పెట్టేసారు.

అలా చికిత్స తీసుకుంటూనే 1994 ఆగస్టు 13న రావు గోపాలరావు మృతిచెందారు. ఈయన మృతి చెందినప్పటికీ చిత్ర పరిశ్రమ ఇంకా మద్రాసులోనే ఉంది. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది బడా నిర్మాతలు దర్శకులు ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన పోవడం గమనార్హం.

అల్లు రామలింగయ్య, పి ఎల్ నారాయణ, రేలంగి నరసింహ రావు, నిర్మాత జై కృష్ణ వంటి కొందరు మాత్రమే ఈయన పార్థివదేహానికి నివాళులర్పించి ఈయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు రావు రమేష్, క్రాంతి తన తండ్రి పార్థివదేహానికి అగ్ని సంస్కారం జరుపుతున్న క్రమంలో ఆపండి అంటూ కొందరు తమిళ మిత్రులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో చుట్టూ చూసి ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటూ తమిళంలో అడిగారట.. ఆ సమయంలో అక్కడే ఉన్న అల్లురామలింగయ్య వచ్చేవాళ్ళు ఎవరూ లేరని సమాధానానం ఇచ్చారట.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియ చేయకపోవడం ఎంతో బాధాకరం. ఇంత గొప్ప నటుడికి సాదాసీదాగా అగ్ని సంస్కారాలు చేయడం చాలా బాధగా ఉంది అంటూ ఆ తమిళ మిత్రులు ఈయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారట. అయితే అప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోవడం జరిగింది.. రావు గోపాలరావు అంత్యక్రియలు చెన్నైలో జరగడం కూడా ఒక రకంగా సినీ ప్రముఖులు వెళ్లలేకపోయారనే వాదన వినిపిస్తుంది. ఇక ఈయన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి పెద్ద కుమారుడు రావు రమేష్ వచ్చారన్న సంగతి మనకు తెలిసిందే.