తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయనుంది. ఇప్పటికే గత నాలుగు సీజన్లతో ఎంతో మంచి రేటింగ్స్ తో దూసుకుపోయిన ఈ రియాల్టీ షో రేపు సాయంత్రం ప్రేక్షకులను అలరించనుంది.
గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్ 5 కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి హ్యట్రిక్ కొట్టనున్నాడు. అయితే ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి వార్తలు వినిపించినప్పటికీ తాజాగా ఫైనల్ లిస్టు ఇదేనంటూ ఓ లిస్టు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫైనల్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే..
డాన్స్ మాస్టర్ యాని, యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, యూట్యూబర్ సరయు, నటరాజ్ మాస్టర్, నటి శ్వేతా వర్మ, సీరియల్ నటి ప్రియ, లహరి, సీరియల్ హీరో మానస్, ఆర్.జె.కాజల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్ విశ్వ కూడా ఈ బిగ్‌బాస్ 5లో పాల్గొనబోతున్నారంటూ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…