టాలీవుడ్ లో ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ లేఖ. ఎం.ఎం. కీరణవాణి చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలేఖ ఇప్పటివరకూ చాలా సినిమాలకు సంగీతం అందించారు. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని హిందీ, తమిళ, మళయాలం, కన్నం వంటి భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దీనిని డా. డి. రామానాయుడు నిర్మించారు. దీనిలో సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ పనిచేశారు. ఆ తర్వాత శివయ్య, ప్రేయసి రావే.. ఆపరేషన్ దుర్యోదన వంటి 70కి పైగా సినిమాలకు బాణీలను అందించారు శ్రీలేఖ. అయితే ఆమె తాజాగా పోసానీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోసానీ కృష్ణ మురళికి కోపం ఎక్కువగా ఉంటుందని.. తొందర్లో టపటపా మాట్లాడేసి.. తర్వాత కూల్ అవుతారని చెప్పుకొచ్చారు. ఒక సాంగ్ కంపోజ్ చేయడం లేట్ అయిందంటే.. ఎందుకు.. ఏమైందటూ ఆవేశ పడతారాని.. తెలిపారు. కాల్ చేసిన రెండో రింగ్ కు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే.. అతడికి కోపం విపరీతంగా వస్తుందని శ్రీలేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అతడు మంచి విజన్ ఉన్న దర్శకుడు అని.. ఎలాంటి టెన్షన్ లేని సమయంలో ‘రాజా’ అంటూ సంబోధిస్తారని చెప్పారు. కోపం వచ్చినా కేవలం తాత్కాలికంగా ఉంటుందని.. తదుపరి సెకన్లో అన్నీ మర్చిపోతారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పోసానీతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేసినట్లు.. ఆ సినిమా పేరు ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’అని చెప్పారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదని ఆమె అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…