ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పిల్లలు కాలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు తన భర్త పొట్టి దుస్తులు వేసుకొని తన ముందు నిలబడి ఫొటోలు దిగాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆమె బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016 సంవత్సవరంలో ఎంబీఏ పూర్తి చేసిన సదరు మహిళ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నివాసం ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఆసక్తి ఉండటంతో ఆ కోర్సులో చేరింది. అందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మహ్మద్ ఫర్హాన్(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడినే 2017 సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకుంది.
ఆ సమయంలో అతడికి రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు. పెండ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అలాగే ఆమె ఇంట్లోనే ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ ఉంది. తన భర్త లోదుస్తుల్లో తనకు కనిపించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
అలా వీడియోలు, ఫొటోలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. ఇంకా తనకు అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం.. లేకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. మరొ పక్క అత్తమామల పోరు భరించలేక ఆమె బంజారాహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…