Featured

యాడ్ ఫిలింస్‌కి తప్ప హీరోయిన్‌గా పనికిరాదన్న హీరోయిన్ యామీ గౌతమ్.. బాలీవుడ్‌లో స్టార్ గా వెలుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో లక్ మాత్రమే ఫేవర్ చేస్తుందనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో దర్శక, నిర్మాతలు ఇది సెంటిమెంట్‌గా భావిస్తారు. ఒక సినిమా హిట్ అయితే ఇక ఆమె కాల్‌షీట్స్ కోసం ఎంతగా ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్ వేసుకొని మరీ ముందు వెనక ప్రాజెక్ట్స్ ఏమైనా కమిటయిందేమో చూసి, ఆ ప్రాజెక్ట్స్‌కి నిర్మాతలు ఎంత రెమ్యునరేషన్ ముట్టచెబుతున్నారో ఆరా తీసి దానికి రెట్టింపు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయి అడ్వాన్స్‌గా చేతిలో చెక్ పెట్టేస్తారు.

అదే ఒక హీరోయిన్ డెబ్యూ సినిమా ఫ్లాపయిందంటే మాత్రం ఆమె ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోరు. ఇక ఖర్మ కాలి రెండు మూడు భాషలలో చేసిన మొదటి సినిమా ఫ్లాప్  లిస్ట్‌లో చేరితే ఆమె ఇక పనికిరాని వస్తువుగా చూసే వారే ఎక్కువగా ఉంటారు. గతంలో ఒక హీరోయిన్‌ని అలానే సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని మేకర్స్ చూసిన సందర్భాలున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు యామీ గౌతమ్. ఈమె కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గానే మిగిలాయి. హీరోయిన్‌గా చేస్తూనే కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో కూడా వెలుగుతోంది.

యామీ గౌతమ్ 2010లో కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత 2011 లో పంజాబీ సినిమాలో నటించింది. ఇక 2011 లోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ‘నువ్విలా’ సినిమాతో పరిచయమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. తెలుగులో చేసిన డెబ్యూ సినిమా ఫ్లాప్ అంటే అంత త్వరగా నిర్మాతలు మళ్ళీ అవకాశం ఇవ్వరు. దాంతో పంజాబీ, హిందీ, మలయాళ, తమిళ సినిమాలో అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కునే ప్రయత్నం చేసింది.

తెలుగులో అల్లు శిరీష్ సరసన ‘గౌరవం’ సినిమాతో మళ్ళీ 2013లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తరువాత నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాతో 2015లో టాలీవుడ్ మరోసారి నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. దాంతీ మళ్ళీ ఈమెకి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కలేదు. అంతేకాదు యామీ గౌతమ్ హీరోయిన్ గా వేస్ట్ అని కామెంట్స్ చేశారు. తనకి కమర్షియల్ యాడ్ ఫిలింస్ తప్ప సినిమాలలో నటించే సత్తా లేదని మాట్లాడుకున్నారు. అయితే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాలో అవకాశం అందుకుంది. అంధ యువతిగా అద్భుతమైన నటనను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్‌లో యామీ గౌతమ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం తాను బూత్ పోలీస్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అలాగే లాస్ట్, దస్వీ అనే చిత్రాలు యామీ గౌతమ్ చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు హీరోయిన్ గా పనికి రాదన్నవాళ్లే ఇప్పుడు తన సినిమాలను చూసి ప్రశంసిస్తున్నారు. కాగా యామీ గౌతమ్ కి యాడ్స్ లో బాగా పేరు తీసుకు వచ్చింది  ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్. దీనికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ యాడ్ చూసి యామీ గౌతమ్ కి అవకాశాలిచ్చిన వారున్నారు కూడా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago