Featured

సర్దార్ గా వచ్చిన ఈ నలుగురు హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూడండి..!!

ఒకే టైటిల్ తో రెండు లేదా మూడు చిత్రాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.కానీ అనుకున్న విధంగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ.

అలా సర్దార్ టైటిల్ తో దాదాపు నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని హిట్టు మరికొన్ని ఫట్టు.. ఆ సినిమాలు ఏంటో ఒకసారి తరచి చూస్తే…

1980 అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీరామారావు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. శారద ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. బ్రిటిష్ కాలం నాటి కథతో వచ్చిన ఈ సినిమా లో ఎన్టీరామారావు ద్విపాత్రాభినయం చేశారు. 1980 లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.

1987 బాల బాలాజీ ప్రొడక్షన్స్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘సర్దార్ కృష్ణమనాయుడు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ,విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి శారద ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. 1987 లో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది.

1987, యలమంచిలి సాయిబాబు నిర్మాణం, భాస్కర రావు దర్శకత్వంలో ‘సర్దార్ ధర్మన్న’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలి బ్రహ్మన్న ‘సినిమాను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన సర్దార్ ధర్మన్న’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది

2016 శరత్ మరార్ నిర్మాణం, కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటించారు. 2012 లో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సహ నిర్మాతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ తన బాణీలతో సినిమా విజయానికి ఎంతగా కృషి చేసినా, కథలో బలం లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద తిరోగమనం పట్టింది.

‘సర్దార్’ పేరుతో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో ఒక్క ఎన్టీ రామారావు నటించిన ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రమే విజయవంతం అయ్యింది. మిగతా మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago