సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు కార్ల అంటే ఎంతో పిచ్చి ఉంటుంది.ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే ఆ కారు పక్కా వారి గ్యారేజీలో ఉండాల్సిందే. ఈ విధంగా కార్ల కలెక్షన్ అంటే ఇష్టం ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయనకు కార్లంటే ఎంతో ఇష్టం.ఈ విధమైనటువంటి ఇష్టంతోనే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారును కొనుగోలు చేస్తుంటారు.
తాజాగా యంగ్ టైగర్ ఫారెన్ నుంచి ప్రత్యేకంగా తనకెంతో ఇష్టమైన లంభోర్ఘిని బ్రాండ్ కారును ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కార్ల అంటే ఎంతో ఇష్టం ఉన్నా తారక్ కార్ల గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అతను ఏ కారు కొన్న నెంబర్ మాత్రం 9999 ఉంటుంది. ఈ విధంగా అన్ని కార్లకు ఒకే నెంబర్ ఉండడానికి కారణం కూడా ఉంది.
అయితే చాలామంది అన్ని కార్లకు ఈ నంబర్ ఉండటానికి కేవలం అతని సెంటిమెంటే కారణమని చెబుతుంటారు. కానీ కార్ల నెంబర్ విషయం గురించి ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ తనకు ఈ నెంబర్ అంటే సెంటిమెంట్ ఏం కాదని, 9 అనే నెంబర్ అంటే తనకు ఇష్టమని తెలియజేశారు. అదే విధంగా తన తాత నందమూరి తారకరామారావు కారు నెంబర్ కూడా 9999 ఉండటం వల్ల తనకు అదే నెంబర్ అంటే ఇష్టమని తెలియజేశారు.
తన తర్వాత తన తండ్రి కూడా అదే నెంబర్ కారును ఉపయోగించేవారని, వారిపై ఉన్న ఇష్టం వల్ల అదే కారు నెంబరు తను వాడుతున్నారని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేశారు. మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉండటం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR”సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పాల్గొనబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…