మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తినాల్సిందే..!

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటి పండు ఒకటి అని చెప్పవచ్చు. ఈ అరటి పండును ఎంతోమంది ఇష్టంగా తింటారు. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో లభించే మినరల్స్, విటమిన్స్, ఫైబర్,పొటాషియం అధిక శాతంలో ఉండటం వల్ల రోజంతా మనకు ఎంతో శక్తిని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

 

అరటి పండులో ఎక్కువ భాగం పోషకాలు లభించడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అరటి పండ్లలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఆహారం జీర్ణం అవ్వడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్దక సమస్యను నివారించడంలో అరటిపండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకోసమే భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు ఒక అరటి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దక సమస్యను తొలగిస్తుంది.

అరటి పండులో ఉండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రక్తపోటును నివారించడంమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది. మన కడుపులో మంట, అజీర్తి ఏర్పడినప్పుడు అరటిపండు తినడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అరటి పండులో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అరటి పండును ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.