Donates: ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు కనుక ఇచ్చారో అప్పలపాలు అయినట్టే?

Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.

ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.

పుణ్యం కలుగుతుంది..

అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.