Movie News

Venu Swamy: వేణు స్వామి సినిమాలలో నటించారని తెలుసా…? అయన నటించ పాత్ర ఏంటో తెలుసా?

Venu Swamy: వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన జ్యోతిష్యం చెబుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. అయితే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించి జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు. ఇలా కొంతమంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినటువంటి మాటలు నిజం కావడంతో ఈయననే నమ్మే వారి సంఖ్య అధికంగా ఉంది.

ఇటీవల కాలంలో వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు నిజం కాకపోవడంతో ఈయన ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇలా తరచూ ఏదోక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి వేణు స్వామి గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ఇప్పటివరకు జాతకాలు చెబుతూ జ్యోతిష్యుడుగానే అందరికీ పరిచయం కానీ యాక్టర్ గా సినిమాలలో కూడా నటించారని తెలుస్తుంది.

ఈయన నటించిన సినిమాలకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. అరే వేణు స్వామి జ్యోతిష్యుడు మాత్రమే కాదా యాక్టర్ కూడానా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఈయన ఏ సినిమాలలో నటించారు ఒకవేళ నటించి ఉంటే ఎలాంటి పాత్రలలో నటించారనే విషయానికి వస్తే..

పూజారి పాత్రలో వేణు స్వామి…

వేణు స్వామి పలు సినిమాలలో నటించిన ఈయన పంతులు పాత్రలలోనే నటించారని తెలుస్తుంది. జగపతిబాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో ఈయన ఆలయంలో ఒక పూజారి పాత్రలో నటించి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాకుండా మహేష్ బాబు త్రిష హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాలో కూడా ఈయన పూజారి పాత్రలోనే కనిపించారు. ఇలా ఈ వీడియోలు వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago